Political

పీలేరులో ఎన్.డీ.ఏ. కూటమి బహిరంగ సభ…

OIP (18)

పీలేరులో ఎన్.డీ.ఏ. కూటమి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి జాగబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. పాలకులు రైతులకు మేలు చేయరని, నిరుద్యోగులను పట్టించుకోరని, వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోనివ్వరని అన్నారు. ఈ అరాచక పాలనకు ముగింపు పలకాలని ఆయన స్పష్టం చేశారు. వై.సీ.పీ. దాష్టికాలు ఆగాలన్నా, యువత, మహిళలు, రైతులకు భరోసా లభించాలన్నా దేశంలో మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. పరిపాలనా దక్షతలేని కక్షపూరిత రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రం ఐదేళ్లుగా తిరోగమనం బాట పట్టిందన్నారు. 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.