మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని షాడోల్ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ను ఇసుక మాఫియా మట్టుబెట్టింది పోలీసులు తెలిపారు. మృతుడు సత్నాలోని సింగ్‌పూర్ నివాసి అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ మహేంద్ర బగ్రీ గా గుర్తించినట్లు చెప్పారు. అతను షాడోల్ జిల్లాలోని బెహరి పోలీస్ స్టేషన్లో నియమించబడ్డాడు. వివరాళ్లోకి వెళ్తే… ఏ.ఎస్.ఐ. బగ్రీ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి బడోలి గ్రామంలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఖాడోలి గ్రామం సమీపంలో ఇసుక లోడ్‌తో కూడిన ట్రాక్టర్ తమ వైపుకు రావడం గమనించారు. అతను తన వాహనం దిగి, ట్రాక్టర్ ట్రాలీ డ్రైవర్‌ను ఆపమని అడిగాడు, కానీ బదులుగా నడిపిన వ్యక్తి అతన్ని చంపేశాడు. డ్రైవర్‌ను రాజ్ రావత్ గా గుర్తించి ట్రాక్టర్ యజమాని కుమారుడు అశుతోష్ సింగ్‌తో పాటు పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టర్ యజమానిని అరెస్ట్ చేస్తే రూ. 30 వేలు రివార్డు ఇస్తామని సీనియర్ పోలీసు అధికారులు ప్రకటించారు.
మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం…!!!

