కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని ప్రజలే సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతిఫలం వారికే దక్కుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. కార్యకర్తలు ఆయన విజయంలో భాగస్వాములు కావాలని అన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసేన నాయకులు బలిరెడ్డి నానీ, గారపాటి గణేష్, గొంతిరెడ్డి గంగా నేతృత్వంలో నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరిన వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో జన సైనికులు, వీర మహిళలు, కొత్తగా పార్టీలో చేరుతున్న నేతలు, కార్యకర్తలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఓటులు సాధించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పార్టీ విజయంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి… -జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి-

