Political

నాగబాబుతో అనపర్తి నియోజకవర్గం నేతల భేటీ…

WhatsApp Image 2024-05-04 at 6.33.00 AM

జే.ఎస్.పీ., టీ.డీ.పీ., బీ.జే.పీ. శ్రేణులు కూటమి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… పోలింగు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మెజారిటీ సాధించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు నేతృత్వంలో అనపర్తి నియోజకవర్గంకు చెందిన జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కి చెందిన ముఖ్య నేతలు పిఠాపురంలో ఆయన్ని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్బంగా అనపర్తి వై.సీ.పీ. ముఖ్య నాయకులు సానా సాయిబాబు, బిరదా అన్నవరం, సానా రామకృష్ణ, తదితరులు నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో కూటమి గెలుపు దాదాపుగా ఖరారైందని కార్యకర్తలు అంతా ఐకమత్యంతో పని చేసి అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.