Political

బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు…

WhatsApp Image 2024-05-03 at 5.19.08 PM

దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ నేతలు చెప్పారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్ల పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం కాకినాడలోని ఓ హోటల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ పార్టీలతో కూడిన ఇండియా కూటమి నేతలు కోరారు. ఈ పార్టీలకు చెందిన నేతలు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏ.ఐ.సీ.సీ. సభ్యుడు వి. హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీ.జే.పీ. పాలన సాగిస్తోందన్నారు. రైతులకు, మహిళలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు.

రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోద నిమిత్తం బీ.జే.పీ. తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వ శేషబాబ్జి, ఎం. రాజశేఖర్, సి.పి.ఐ. నాయకులు కే బోడకొండ, ఆప్ నాయకులు నరాల శివ, కృష్ణమోహన్, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.