అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు హై ప్రొఫైల్ స్థానాలకు అభ్యర్థులపై ఉత్కంఠకు తెర తీసింది. అడపాదడపా ఒడిదుడుకులు తప్ప రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచాయి. ఇప్పటికే వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం… రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది, అతని సన్నిహితుడు కిషోరీ లాల్‌కు అమేథీ స్థానం లభించవచ్చు.
రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుండి పోటీకి సిద్దం…!!!

