ఢిల్లీలో ఒకేసారి దాదాపు 50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనితో స్కూల్ యాజమాన్యాలు భయంతో అప్రమత్తమై వెంటనే తమకు సమాచారమిచ్చారని అన్నారు. ఈ-మేయిల్స్ ద్వారా ఈ బెదిరింపులొచ్చాయని వారు తెలిపారాని చెప్పారు. కొన్ని స్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతుండగా బెదిరింపుల నేపథ్యంలో స్కూల్ యాజమాన్యాలు వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో బాంబ్ డిటెక్షన్ బృందం తనిఖీలు చేస్తున్నారని అధికారలు తెలిపారు. ఈ-మెయిల్ ఐ.పీ. అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెళ్లడించారు.
ఢిల్లీ లో పాఠశాల్లకు హై అలర్ట్…
