జనసేన పార్టీపై అమితమైన అభిమానంతో అమెరికా నుంచి వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములైన కటకం విజయ్ కుమార్ హఠాన్మరణం దిగ్భ్రాంతిని కలిగించిందిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని అన్నారు. అమెరికాలో వ్యాపార రంగంలో ఉన్న విజయ్ కుమార్ అక్కడి జనసేన ప్రవాసాంధ్ర విభాగంలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం నెల రోజుల నుంచి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. ఆయన గుండె పోటుతో కన్నుమూశారని తెలిసి బాధపడ్డానని అన్నారు. విజయ్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.
కటకం విజయ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి… -జనసేన అధినేత-
