ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేది జనసిన, టీ.డీ.పీ., బీజేపీ కూటమి ప్రభుత్వమేనని వై.సీ.పీ. ఓడిపోవడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. వై.సీ.సీ. ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేసే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిఠాపురం తెలుగు దేశం ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ లోక్ సభ ఎన్.డి.ఏ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం బీ.జె.పీ. కృష్ణంరాజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా వై.సీ.పీ. ని గద్దె దించాలన్నారు.
వై.సీ.పీ. ఓడిపోవడం ఖాయం… -జనసేన పార్టీ అధ్యక్షులు-

