ఇండోర్ లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పార్టీ అనిశ్చిత మార్గంలో పడింది. ఓటింగ్‌కు రెండు వారాల ముందు నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ రేసు నుండి తప్పుకున్నారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు బీ.జే.పీ. ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
ఇండోర్ స్థానానికి నామినేషన్లు ఏప్రిల్ 25న ముగిశాయి. ఈ నియోజకవర్గంలో మే 13వ తేదీన నాల్గవ దశలో ఓటింగ్ జరరగనుంది. ఇండోర్‌లోని సిట్టింగ్ బీ.జే.పీ. ఎం.పీ. శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ బామ్‌ను రంగంలోకి దింపింది. ఇండోర్ బీ.జే.పీ. కి కంచుకోటగా ఉన్నప్పటికీ.. బామ్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడం ఖచ్చితంగా పోటీని ఏకపక్షంగా చేస్తుందని విశ్లేషకులు తెలిపారు.

