పిఠాపురం నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని అన్నారు. గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో మాట్లాడుతూ… పడి లేచిన కెరటంలా పవన్ కళ్యాణ్ ఓటమిని తట్టుకుని ప్రజల కోసం పదేళ్లపాటు పోరాటం చేస్తూనే ఉన్నారని అన్నారు. జనసేన పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి జన సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. చేతిలో అధికారం లేకపోయినా అన్ని వర్గాలకు అండగా నిలచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ని, ఎం.పీ. అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు.
దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారు… -వరుణ్ తేజ్-

