భారతీయ జనతా పార్టీ శనివారం ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుండి లోక్‌సభ అభ్యర్థిగా మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్‌ను పోటీకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్‌పై ఆయన పోటీ చేయనున్నారు. బీ.జే.పీ. తన ముంబై నార్త్ సెంట్రల్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎం.పీ. పూనమ్ మహాజన్‌ను తప్పించి, ఆమె స్థానంలో నికమ్‌ను నియమించింది. అనేక పోల్ సర్వేలు ఆమెకు ప్రతికూల రేటింగ్‌ను చూపించడంతో సంస్థాగత ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహాజన్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కొంత కాలం క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అయితే ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు పార్టీ వెతుకులాటకు సమయం పట్టిందని కొందరు నేతలు పేర్కొన్నారు.
ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ఉజ్వల్ పోటీ…

