కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వై.సీ.పీ. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వారికి కండువా కప్పి గురువారం జనసిన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురం రూరల్ మండలం గోకివాడ గ్రామానికి చెందిన మొత్తం వై.సీ.పీ. కార్యవర్గం ఆ పాలనపై విసుగుచెంది కలిసిగట్టుగా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులను వైసీపీ పక్క దారి పట్టించిదని అన్నారు. సర్పంచ్ అధికారాలను తొలగించేసిందని, తమ గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని తదితర సమస్యలను ఆయనకి తెలిపారు.
వై.సీ.పీ. నుండి జనసేనలో 100 మంది చేరిక…

