వారిస్ పంజాబ్ దే జైలులో ఉన్న చీఫ్, ఖలిస్తానీ అనుకూల నాయకుడు అమృత్ పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని వివిధ మీడియా నివేదికల తెలిపాయి. నివేదికల ప్రకారం… అతను పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నాడు. ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృతపాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం ఎన్.ఎస్.ఎ. తో సహా కఠినమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి అస్సాంకు తరలించారు.
ఒక కథనం ప్రకారం… అమృత్ పాల్ సింగ్ లాయర్ రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా అతని అభ్యర్థిత్వాన్ని ధృవీకరించారు. అమృత్ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తారని ఖల్సా ప్రకటించారు. తాను ఏప్రిల్ 24 దిబ్రూగఢ్‌లో అమృత్ పాల్‌ను కలిశానని, ఈ సమావేశంలో అమృత్ పాల్ తాను ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ధృవీకరించారు.

