అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎన్.డి.ఎ. కూటమి టీ.డీ.పీ. పార్టీ ఎం.పి. అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ బుధవారం నామినే షన్ దాఖలు చేశారు. అమలాపురంలోని స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయం నుండి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను చేస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని తెలిపారని అన్నారు. జగన్ ప్రభుత్వం ఏ ఒక్క మాటపై నిలబడ లేదని పోలవరం ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయ్యలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవన్నీ మాయమాటలని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్ట బోతుందని వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొ న్నారు.
అమలాపురంలో నామినేషన్ వేసిన టీ.డీ.పీ. పార్టీ ఎం.పి. అభ్యర్థి గంటి హరీష్ మాధుర్…

