Political

కొవ్వూరు గ్రామంలో జనసేనా పార్టీలో బారీ చేరికలు…

OIP (49)

కాకినాడ జిల్లా కొవ్వూరు గ్రామంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామానికి చెందిన వై.సీ.పీ. సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు వై.సీ.పీ. 7వ వార్డు మెంబర్ రెడ్డి ముసలయ్య, 13వ వార్డు మెంబర్ కాకి ముసలయ్య మరియు ఆ పార్టీకి చెందిన గ్రామ పెద్దలు, యువకులు సుమారు 100 మంది కొవ్వూరు రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ సమక్షంలో చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీ.డీ.పి., బీ.జే.పీ. పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు అలియాస్ నానాజీ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ… వై.సీ.పీ. పార్టీలో కార్యకర్తకు సరైన గుర్తింపు లేదని, యువతకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు గ్రామ ప్రజలు, టీ.డీ.పి. నాయకులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.