టీ.డి.పీ., జనసేన, బీ.జే.పీ. ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు కార్యాలయంలో టీ.డి.పీ. నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు వైద్యం శాంతారాం రూపొందించిన జయహో నాయి బ్రాహ్మణ, జయహో బీ.సీ. అనే కరపత్రాన్ని ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణులకు బి.సి. కులాల వారికి తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని 50 సంవత్సరాలకే 4వేల రూపాయలు పెన్షన్, వృత్తి నైపుణ్యం కోసం వృత్తి విద్యా కోర్సులు, కార్పొరేషన్ ద్వారా రుణాలు, తదితర అనేక పథకాలు ప్రకటించిందన్నారు.
అనంతరం నాయిబ్రాహ్మణ కుటుంబాల ఇంటింటికీ, షాపు షాపుకు వెళ్లి ప్రచారం చేసారు. ఈ కార్యక్రమము లో నాయిబ్రాహ్మణ నాయకులు సిగటాపుల రామారావు, రాజాన అప్పారావు, వేపాడ బాబ్జీ, సానపల్లి వీరబాబు, గూనపల్లి దుర్గా ప్రసాద్, కడవకొల్లు వీరబాబు,తదితరులు పాల్గొన్నారు.
నాయిబ్రాహ్మణుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -సుందరపల్లి గోపాలకృష్ణ-

