మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ మధ్య ఇటీవల కాంగ్రెస్ నుండి బీ.జే.పీ. లోకి మారిన నగర మేయర్ విక్రమ్ అహకే, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయాలని ప్రజలను కోరారు. యూ-టర్న్ తీసుకొని, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ.. అహకే సోషల్ మీడియాలో వీడియోను కూడా పోస్ట్ చేశారు.
బీ.జే.పీ. వివేక్ బంటీ సాహును రంగంలోకి దించింది. అతనికి మద్దతుగా ప్రచారం చేయడానికి పలువురు పార్టీ అగ్రనేతలు నియోజకవర్గాన్ని సందర్శించారు. ప్రస్తుతం పార్లమెంటరీ ఎన్నికల మొదటి దశ జరుగుతున్న ఆరు లోక్‌సభ స్థానాల్లో చింద్వారా కూడా ఒకటి.
కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బీ.జే.పీ. మేయర్ విక్రమ్ అహకే…

