భీమవరం వెంప గ్రామంలో ఎడప్ట్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారు ఆటో మేటిక్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లేంట్ ను విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం చైర్మన్ కే.వీ. విష్ణు రాజు చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కే.వీ. విష్ణు రాజు ను కలిడింది నాగ వర్మను, నడింపల్లి వెంకట రామరాజును వెంప గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సేవలను పలువురు అభినందిస్తూ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో జి. భీమరాజు, వెంప గ్రామ కో-ఆర్డినేట్ కలిడింది నాగ వర్మ, ఉభయగోదావరి జిల్లా కో-ఆర్డినేట్ నడింపల్లి వెంకట రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
భీమవరం వెంప గ్రామంలో ఆటో మేటిక్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు…

