పశ్చిమ బెంగాల్‌లోని దిఘా నుండి ఇద్దరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను అరెస్టు చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. సి.ఎం. మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామమని, దానికి టి.ఎం.సి. ప్రతినిధి అని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పేర్కొన్నారు. దానికి ప్రతి స్పందనగా టీ.ఎం.సీ. నేత కునాల్ ఘోష్ కౌంటర్ ఇస్తూ.. కొంటాయ్ నుండి ఏ కుటుంబం, బీ.జే.పీ. ప్రధాన నాయకుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో మనందరికీ తెలుసని అన్నారు
ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన కొత్త దిఘా హోటల్, బిజెపి నేత సువేందు అధికారి తండ్రి సిసిర్ అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న కొంటాయి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. సువేందు సోదరుడు సౌమేందు ఈసారి కొంటాయి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
తన పేరును ఈ కేసులోకి లాగడంపై సువెందు స్పందిస్తూ.. బెంగాల్ ఇప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ మిలిటెంట్లకు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక ఫ్రీ జోన్ గా పదే పదే రుజువైందని అన్నారు. కూచ్‌బెహార్‌లోని దిన్హటాలో జరిగిన ర్యాలీలో మమత మాట్లాడుతూ… బెంగాల్ పోలీసులకు మొదటి సమాచారం అందిన రెండు గంటల్లో వీరిద్దరినీ అరెస్టు చేయడం తమ సమర్థతకు నిదర్శనమని అన్నారు.

