కర్నూలు లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీ.డీ.పీ. కి చెందిన పలువురు ప్రముఖ నేతలు వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఆలూరు మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ , కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి అలియాస్ గడ్డం ప్రకాష్‌రెడ్డి, ఆయన సమీప బంధువైన టీ.డీ.పీ. నేత కోట్ల హరి చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత, చిప్పగిరి మాజీ ఎం.పీ.పీ. వైకుంటం మల్లికార్జున చౌదరి ఈ చేరికలో ఉన్నారు. ధోన్ అసెంబ్లీ సెగ్మెంట్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆయన సోదరుడు కే.ఈ. ప్రతాప్ కుటుంబ సభ్యులు మరో ఒకటి రెండు రోజుల్లో అధికార పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
కర్నూలులో టీ.డీ.పీ.కి భారీ షక్ తగిలింది…

