మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అయితే 19 సంవత్సరాల కూతురు సాయిషుమా సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది. దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి మందలించి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అంటూ సాయిషుమా మనస్తాపంతో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఫోన్ బాగు చేయించలేదని యువతి ఆత్మహత్య…
