పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎట్టకేలకు ఖండించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఎట్టి పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీని విడిచి ఎక్కడికి వెళ్లబోయేదిలేదని గట్టిగా నొక్కి చేప్పారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. ఎవరో చేసిన ఆరోపణలను పట్టించుకోవలసిన అవసరం ఆమె అన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ నేతలు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆమె అన్నారు.
తప్పుడు ప్రచారాలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

