Political

వాలంటీర్లకు అండగా నిలబడతాం…

WhatsApp Image 2024-04-12 at 9.56.03 AM

వై.సీ.పీ. ప్రభుత్వంలో వాలంటీర్లంతా తప్పు చేశారని ఎప్పుడూ అనలేదని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. కొందరు చేసిన పని వల్ల చెడ్డ పేరు అందరికీ వస్తోందని మాత్రమే చెప్పానన్నారు. కూటమి ప్రభుత్వంలో టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు చెప్పినట్లు వారికి రూ.10 వేల వేతనం ఇచ్చి, ప్రజలకు మేలు చేసే పనులకు వారిని ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా వారితో పని చేయించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇలా పని చేసేవారికి కచ్చితంగా మేం అండగా నిలబడతాం. వాలంటీర్ల కడుపుకొట్టేలా ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసారు. ముఖ్యంగా కోనసీమలో రైలు కూత వినిపించాలనేది దివంగత లోక్ సభ స్పీకర్ జీ.ఎం.సీ. బాలయోగి కోరికన్నారు. దాన్ని సాకారం చేసేలా కోనసీమకు రైలు మార్గం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.