అనకాపల్లి పట్టణం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జయ జయ ధ్వానాలతో స్వాగతించింది. ఆడపడుచుల హారతులు, జన సైనికుల జేజేలతో పులకరించింది. వారాహి విజయభేరీ యాత్ర డప్పు చప్పుళ్లు, వీర మహిళల కేరింతలు, ఆడపడుచుల కోలాటాల మధ్య సుమారు గంటన్నర పాటు ఆయన పురవీధుల్లో రోడ్ షో నిర్వహించారు. జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు రెండు కిలోమీటర్ల మేర అనకాపల్లి వీధులు వారాహి విజయ భేరీ సభకు తరలివచ్చిన జనంతో నిండిపోయాయి. వారాహి ధారియై పవన్ కళ్యాణ్ కిక్కిరిసిన జనసందోహం సాక్షిగా విజయనాదం చేశారు.
జన సాగరమైన అనకాపల్లి పుర వీధులు…

