తెలంగాణ రాష్ట్రంలో ఘోర అగ్న ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలోని రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ లో మరమ్మతు పనులు చేస్తుండగా షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు గల కారణం తెలియాల్సుంది.
రత్నదీప్ సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం…

