ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు బీ.జే.పీ. అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను బీఫ్ తిన్నానని ఒకప్పుడు చెప్పారని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యపై మహారాష్ట్ర బీ.జే.పీ. అధికార ప్రతినిధి స్పందిస్తూ… ఇది కాంగ్రెస్ మురికి సంస్కృతిని ప్రతిబింబిస్తోందని అన్నారు. గడ్చిరోలిలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వడేట్టివార్ మాట్లాడుతూ… రనౌత్ గొడ్డు మాంసం ఇష్టపడ్డారు, తింటారు అని X లో పోస్ట్ చేసారని పోర్కొన్నారు. కానీ బీ.జే.పీ. ఆమెకు లోక్‌సభ ఎన్నికలకు టికెట్ ఇచ్చిందని అన్నారు. అవినీతి నేతలందరినీ బీ.జే.పీ. స్వాగతిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీ.జే.పీ. అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ స్పందిస్తూ.. ఇది కాంగ్రెస్ మురికి సంస్కృతిని ప్రతిబింబిస్తోందని, సమస్యలపై మనతో పోరాడలేమని తెలిసి ఆరోపనలు చేస్తున్నారని అన్నారు. ఇది ఆ పార్టీ ఓటమి మనస్తత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు.
బీఫ్ ఇష్టమని చెప్పిన రనౌత్‌కు బీ.జే.పీ. టికెట్… -మహారాష్ట్ర కాంగ్రెస్ నేత-

