Viral

వైఎస్ షర్మిలా బస్సు యాత్ర పర్యటన షెడ్యూల్ ఖరార్…

62de93a3-2141-4f2b-a0bb-cb1e0db9e2f8

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి చేపట్టనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయినట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు లోక్ సభ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు వివరించారు. పర్యటన ప్రాంతాల వివరాలను తెలియజేశారు. ఈ నెల 5వ తేదీన పులివెందుల నియోజకవర్గ పరిధిలోగల కాశి నాయన మండలంలోని అవధూత కాశినాయనను దర్శించుకుని అనంతరం అక్కడి నుంచి కలసపాడు, పోరుమామిళ్ల, కోడూరు, గోపవరం ప్రాంతాలలో పర్యటిస్తారని తెలిపారు.

6వ తేదీన బద్వేల్, అట్లూరు, కడప-1, కడప -2 పర్యటించనున్నారు. 7వ తేదీన దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బీ మటం , అదేవిధంగా 8వ తేదీన వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మ దిన్నె , పెండ్లిమర్రి, వీరపునాయుని పల్లి పర్యటిస్తారని చెప్పారు. 9వ తేదీన చక్రాయపేట వేంపల్లి వేముల పులివెందుల లింగాల సింహాద్రిపురం పర్యటిస్తారు. 11వ తేదీన తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం పర్యటించిన అనంతరం 12 న జమ్మలమడుగు, పెద్ద ముడియం ప్రాంతాలలో పర్యటిస్తారని, బస్సు యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.