Political

నిష్టగా మన ప్రభుత్వ స్థాపనకు పని చేద్దాం…

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n-1024x1024

ప్రతి నెల అందాల్సిన సామాజిక పింఛన్లు ఎన్నికల కోడ్ వల్ల ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలని జనసేన పార్టీ అధి నేత పవన్ కళ్యాన్ అన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేయాలని సూచించారు. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలన్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నేను సహాయం చేశాను అంటే సొంతంగా సినిమాలు చేసి సంపద సృష్టించి ఆ డబ్బును ఆపదలో ఉన్న వారికి పంచానని ఆయన తెలిపారు. వచ్చే కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టించి కచ్చితంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తామని నొక్కి చేప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇస్తున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాం తప్ప ఏ మాత్రం పథకాలు నిలిపివేసేది లేదన్నారు.

వైసీపీ పాలనలో మద్యం, గంజాయి, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిని అరికడితే అన్ని పథకాలకు కచ్చితంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి. వై.సీ.పీ. దోపిడీ అరికడితే సంక్షేమ పథకాలు అప్పులు లేకుండానే అమలు చేయొచ్చని తెలియచేసారు. నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను.. వచ్చేది కూటమి ప్రభుత్వమే. మనం కచ్చితంగా గెలుస్తున్నాం భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. మూడు పార్టీల్లోని ప్రతి కార్యకర్త నాయకుడు 40 రోజుల మండల దీక్ష చేసినట్లు నిష్టగా మన ప్రభుత్వ స్థాపనకు పని చేద్దాం.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.