మూడు పార్టీల సమన్వయంతో పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. కానీ వై.సీ.పీ. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన-తెలుగుదేశం- బీ.జే.పీ. పార్టీల పొత్తు విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరింది. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద లెక్క వేయలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వై.సీ.పీ. కీచక పాలన నుంచి ప్రజలను బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తులకు ఎలాంటి షరతులు పెట్టకుండానే ముందుకు వెళ్లాం. రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం వెనక్కు తగ్గేవాడిని కాదని జనసేన అన్నారు. పిఠాపురంలో జనసేన- తెలుగుదేశం- బీజేపీ నాయకుల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజక వర్గం టిడిపి ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీ.జె.పీ. ఇంచార్జ్ బి. కృష్ణంరాజు పాల్గొన్నారు.

