కాకినాడ జిల్లా కలెక్టర్ గా జే. నివాస్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. నాయక్ ఇతర జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అభ్యర్థులకు కావలసిన అనుమతులు అన్నీ ఇస్తూ… ప్రజలకు ఏ సౌకర్యాలు కల్పించాలో వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్గా జే. నివాస్ బాధ్యతలు…

