అధికార భారతీయ జనతా పార్టీ కి చెందిన పలువురు సిట్టింగ్ ఎం.పి. లు ఇటీవలి రోజుల్లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ అయిష్టత వ్యక్తం చేశారు. తమను రిలీవ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాను అభ్యర్థించారు. ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బీ.జే.పీ. తన మొదటి జాబితాను విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందు, తూర్పు ఢిల్లీ నుండి పార్టీ సిట్టింగ్ ఎం.పీ., మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను ఎన్నికల బాధ్యతల నుండి తప్పించాలని నడ్డాను కోరారు. తద్వారా అతను తన రాబోయే క్రికెట్ కట్టుబాట్లపై దృష్టి పెట్టవచ్చునని అన్నారు. వెంటనే జార్ఖండ్‌లోని హజారీబాగ్ నుండి బీ.జే.పీ. సిట్టింగ్ ఎం.పి. జయంత్ సిన్హా తనను ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుండి తప్పించవలసిందిగా పార్టీ చీఫ్‌ని అభ్యర్థించినట్లు సమాచారం.
బీ.జే.పీ.కి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎం.పీ.లు…

