Political

పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు భేటీ…

253cb0d0-f458-43b6-8d50-17444821e0ee

స్థానిక సంస్థల ఎన్నికల్లో వై.సీ.పీ. దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలని తెలిపారు.

పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసినదే. గెలుపూ మనదే’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పి.గన్నవరం నియోజకవర్గానికి స్థానిక ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి ఇంచార్జ్ లేకపోయినా అక్కడి పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు ఒకే తాటి మీద నిలిచారన్నారు.

పార్టీ విధివిధానాలను అనుసరించారని, ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారని కొనియాడారని. ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అనుసరించిన విధానం అందరికీ ఆదర్శమన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దిశదశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే అన్నారు. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు, ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.