29 సంవత్సరాలుగా అటు ప్రజలకు ఇటు టి.డి.పి. పార్టీకి సేవచేస్తూ నియోజకవర్గంలో ప్రాంతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా పరమట శ్యామ్ కుమార్ అభిమానులను సంపాదించుకున్నారు. నిత్యం ప్రజలకు తోడుగా ఉంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
2004 నుండి 2019 వరకు చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఈ సారి 2024లో న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ ఈసారి కూడా న్యాయం జరగకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన శ్యామ్ వర్గీయులు, వివిధ కుల సంఘాల నేతలు, వివిధ అసంతృప్త నాయకులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధిక సంఖ్యలో తన స్వగృహానికి మద్దతుదారులు చేరుకోవడంతో కార్యాచరణ రూపొందించే పనిలో పడినట్లు సమాచారం.

