రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో 144 సెక్షన్ అమలవుతోందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా మీడియా సమావేశంలో అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకు సంబందించి సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని వెళ్లడించారు. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని తెలిపారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేసామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్నికల ప్రచారాలకు తిరగకూడదని అలా కాదని తిరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏ.పీ. లో 144 సెక్షన్ అమలు… -ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్-
