కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కారుణ్య నియామకాల కింద 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు స్పందన కార్యక్రమంలో కారుణ్య నియామక పత్రాలు ఆమె అందజేశారు. వీరిలో ఒకరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోని బాధిత కుటుంబ సభ్యునికి ఉద్యోగ నియామక పత్రం అందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురికి జూనియర్ సహాయకులుగా, నాలుగురికి ఆఫీస్ సబార్డినేట్ గా నియామక పత్రాలు అందజేశామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారిగా ఖాళీల సంఖ్య, రోస్టర్, సీనియారిటి ప్రకారం అభ్యర్థులకు పోస్టీంగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు.

