రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60 రోజుల పాటు ప్రజా చైతన్య పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తా శశిధర్ తెలిపారు. కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పర్యటించి 67 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్ర భూమి వద్ద సముద్రంలో సేకరించిన మట్టిని కలిపామని చెప్పారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ…. కాకినాడ పరిసర ప్రాంతాల్లో 40 రోజులు పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సమాధి ఉన్న ప్రదేశాలను పర్యటిస్తామన్నారు.
అక్కడ మట్టిని సేకరించి ముంబైలోని అంబేద్కర్ సమాధి ఉన్న చైత్ర భూమి దగ్గర కలపడం పట్ల జనసేన తమ విధేయతను మరోసారి ప్రదర్శించిందన్నారు. వచ్చే వంద రోజుల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఈ చైతన్య పోరాటంలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేస్తుందన్నారు. అనంతరం ప్రజా చైతన్య పోరాటం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జనసేన కాకినాడ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, చోడిపల్లి సత్యవతి, బండి సుజాత, సబ్బే దీప్తి తదితరులు పాల్గొన్నారు.

