కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు.
పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, తండ్రి శ్రీను వారు పెద్దాపురం పరిసర ప్రాంత గ్రామ కార్డుదారుల నుండి రూ.20/-కు కొనుగోలు చేసి రూ.22/-లకు జగ్గంపేట లోని ఇటుకబట్టి కార్మికులకు అమ్ముతున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ 7,27,400/- లు ఉంటుందన్నారు.
ఇంకోక వాహనం నెం. AP31 TC 9619 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 53 బస్తాలలో సుమారు 2650 కేజీల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ 4,20,575/- లు ఉంటుందని వెళ్లడించారు. ఈ ఘాతగానికి పాల్పడిన వీరిపై 6-ఏ క్రింద కేసు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖిలలో కార్యాలయ సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాధరెడ్డి, జగ్గంపేట సి.ఎస్.డి.టి కృష్ణ, కానిస్టేబుల్స్ వలీ, వీరబాబు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు .

