కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెచ్చేసి భూమి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ… 45వ డివిజన్ కొండయ్యపాలెంలో కమ్యూనిటీ హాల్, సచివాలయ భవన నిర్మాణం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.
వై.సీ.పీ. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అభివృద్ధిలోను, సంక్షేమంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకువెళ్తుందన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎం.పీ. వంగా గీత, ద్వారం పూడి చంద్రశేకర్ రెడ్డి, వై.సీ.పీ. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

