భారతదేశంలో 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కేసులు కొత్తగా 609 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ప్రస్తుతం భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్-19 కేసులు 3,368 వద్ద చేరుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో ఆరు మరణాలు నమోదయ్యాయని… కర్ణాటక నుండి ఒకటి, కేరళ నుండి రెండు మరియు పశ్చిమ బెంగాల్ నుండి మూడు సంబంవించాయని వెళ్లడించింది.
దేశం మొత్తం మరణాల సంఖ్య 5,33,412 కు చేరుకున్నట్టు తెలిపింది. కొత్త వేరియంట్ JN.1 ఉష్ణోగ్రత వల్ల కేసులు పెరగడం ప్రారంభించాయని తెలిపింది. JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 682 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రజలు భయపడవద్దని ప్రభుత్వం సూచించింది. అయితే ముందుజాగ్రత్త చర్యగా కొమొర్బిడిటీలు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఫేస్ మాస్క్‌లను ధరించాలని సూచించింది.

