అంగన్వాడీలు, వర్కర్లు చేసట్టిన న్యాయ పోరాట నిరసన 21వ తేదీకి చేరుకుంది. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరంలో అంగన్వాడీలు కొత్త రీతిలో నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర సంఘం సీ.ఐ.టీ.యూ. పిలుపుమేరకు వారు సీఎం మనసు మారి మా డిమాండ్లకు నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడి యూనియన్ నాయకురాలు పి వెంకటలక్ష్మి కె సూర్య కళ ఇందిరా మాట్లాడుతూ… అధికారంలోకి రాక ముందు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రమయిన తెలంగాణ కన్న 1000 రూపాయిలు ఎక్కువ ఇస్తాన్నని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మరిచి మడపు తిప్పారని ఆందోళన తెలిపారు.
21వ తేదీకి చేరుకున్న అంగన్వాడీల న్యాయ పోరాటం…

