హిమాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల ఓటింగ్ తేదీ దగ్గర పడింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇదిలా ఉంటే హిమాచల్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ… కాంగ్రెస్ మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు మొత్తం ఆరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
రాజ్యసభ ఎన్నికల సమయంలో తిరుగుబాటు చేసిన నేతలను చూపిస్తూ.. కరెన్సీ నోట్లతో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నించిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హిమాచల్ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇదేనని ఆయన అన్నారు. వచ్చే మూడున్నరేళ్లు నేనే సీఎంగా ఉంటాం అని ధీమా వ్యక్తం చేసారు.

