భారతదేశంలో సుమారు 2 వేల రైల్వేస్టేషన్లో ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర హాయ్ మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీ.సీ. సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని 554 అమృత్ భారత్ స్టేషన్లు మరియు 1500 రైల్వే ఫ్లైఓవర్/అండర్‌పాస్‌ల పునరుద్ధరణతో సహా దేశ వ్యాప్తంగా 2వేల రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేసారు. ఇందులో భాగంగా రూ. 270 కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషను పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి ఎం.పీ. భరత్ రామ్, బీ.జే.పీ. సీనియర్ నేత సోము వీర్రాజు హాజరయ్యారు.
2 వేల రైల్వేస్టేషన్లో ఒకేసారి ఆధునీకరణ చేయనున్న మోదీ…

