రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదని, వారున్నారా.. లేరా..? అనేదానిపై జగన్ జవాబు చేప్పాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతి ఏటా డేటా లేని వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ. 617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారని, అసలు వీరంతా ఎక్కడున్నారని అన్నారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజల ముందు పెట్టాలన్నారు.
1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు…

