హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో గందరగోళం జరిగింది. అందులో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. వివరాల్లోకి వెళితే… ఏ.బీ.వీ.పీ. విద్యార్థులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. అయితే ఆ కార్యక్రమంలో విద్యార్దుల మద్య చెలరేగిన వివాదం చివరికి ఏ.బీ.వీ.పీ., ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ పడినవారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గందరగోళం…
