హైదరాబాద్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఏ.ఆర్. పైప్ వర్క్‌షాపుకు సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు చిత్తు కాగితాలు ఏరుకునే ఒక మహిళను లాక్కెళ్లి అత్యాచారం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమై ఆ మహిళ మృతి చెందిందని అధికారులు తెలిపారు. మృతురాలిని ఆసుపత్రికి తరలించారు. బాదితురాలు 45 సంవత్సరాల సుజాతాగా గుర్తించారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పారిపోయిన ఇద్దరిని గాలిస్తున్నట్లు వెళ్లడించారు.
హైదరాబాద్ లో మహిళపై హత్యాచారం…
