హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అగ్నిప్రమాదానికి గురయ్యింది. అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ వెలువడ్డ రసాయనాల పొగ పీల్చడంతో ఇద్దరు చిన్నారులతో పాటు తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించడంతో బంధువులు కన్నీటి మునిగారు. కాగా అపార్ట్మెంట్ లో ఉంటున్న మరో 21 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి ఉస్మానియా హాస్పిటల్ లో చేర్చారు. ఘటన స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీ తదితరులు సందర్శించారు.
హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ కు అగ్నిప్రమాదం…

