వైయస్సార్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హిందూ దేవత మూర్తుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులు హిందువులు ఎవరూ మర్చిపోరని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. 16 శతాబ్దంలో మొగలులు ముస్లిం పాలకుల కాలంలో హిందూ దేవాలయాల మీద దేవత మూర్తుల మీద జరిగిన దాడులు దోపిడిలతో ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరిగిన దాడులు దోపిడీలను పోల్చడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదని అన్నారు.
కాకినాడలోప్రారంభమైన ప్రజా పోరు యాత్ర రథం పురుషోత్తం లాడ్జ్, లక్ష్మీ హాస్పిటల్, డైరీ ఫారం, కల్పనా సెంటర్ అంబేద్కర్ గులాబ్ జంక్షన్ ల మీదుగా సాగింది. ఈ సందర్భంగా బీ.జే.పీ. నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అనేక హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయని, అయితే దోషుల్లో ఒకరికి కూడా నేటికీ శిక్ష పడలేదని అన్నారు. 2019 సంవత్సరం నుంచి చూస్తే విజయనగరం జిల్లా రామతీర్థం లో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరాముడి విగ్రహం తలను తొలగించడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 12వ శతాబ్దపు శివాలయంలో నందీశ్వరుడు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగిందని, తూర్పుగోదావరి జిల్లా సూర్యాపేటలో ఒక చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో రెండు పురాతన దేవాలయాలను కూల్చి వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏడిద కృష్ణ , చెక్క రమేష్ , కొండేటి గంగాధర్, ఆలమూరు మురళీకృష్ణ, గాలి దేవర శేఖర్ ,గుండోజు బానోజీ రావు ,దిలీప్ కుమార్ సదనాని, తదితరులు పాల్గొన్నారు.

