మే 25న జరగనున్న హర్యానా లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దివ్యాంశు బుద్ధి రాజాను పోటీకి దింపింది. అదేవిధంగా సిర్సా స్థానం నుంచి హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కుమారి సెల్జాను పోటీకి దింపిందనట్లు తెలిపింది.
హిసార్ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎం.పీ. జై ప్రకాష్‌ను, అంబాలా నుంచి ములానా ఎమ్మెల్యే వరుణ్ చౌదరిని అభ్యర్థిగా ప్రకటించినట్లు పార్టీ వెళ్లడించింది. కాంగ్రెస్ నేత సత్పాల్ బ్రహ్మచారి సోనెపట్ నుంచి, దీపేందర్ సింగ్ హుడా రోహ్ తక్ నుంచి, మహేంద్ర ప్రతాప్ ఫరీదాబాద్ నుంచి పోటీ చేయనున్నారు.
మాజీ ఎం.పీ., హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శృతి చౌదరి స్థానంలో మహేంద్రగఢ్ ఎమ్మెల్యే రావ్ దాన్ సింగ్‌ను భివానీ-మహేంద్రగఢ్ స్థానం నుంచి పార్టీ నామినేట్ చేసింది. హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో దశ ఎన్నికలు జరుగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించింది.

