జూలై 2న యూ.పీ. లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 122 మందికి పైగా మరణించారు, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హత్రాస్‌కు 47 కిలోమీటర్ల దూరంలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై స్పందించిన సీ.ఎం. యోగి ఆదిత్యనాథ్ దీనిపై విచారణకు ఆదేశించారు. హత్రాస్ ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక చర్యలు తీసుకున్నారు.
సికిందరావు తహసీల్ పరిధిలోని ఆరుగురు అధికారులను దోషులుగా నిర్ధారించారు. సికిందరావు ఎస్.డీ.ఎం. రవీంద్రకుమార్, తహసీల్దార్ సుశీల్‌కుమార్, సీ.ఓ. డాక్టర్ ఆనంద్‌కుమార్, కొత్వాలి ఇన్‌చార్జి ఆశిష్‌కుమార్‌తో పాటు పోరా చౌకీ ఇన్‌చార్జి బ్రిజేష్ పాండే, కచోరా చౌకీ ఇన్‌చార్జి మన్వీర్ సింగ్‌లను సస్పెండ్ చేశారు. హత్రాస్ తొక్కిసలాటపై ఏర్పాటైన సిట్ తన మొత్తం నివేదికలో ఎక్కడా కూడా నారాయణ్ సకర్ హరిని ప్రస్తావించలేదు.
